అమరావతి : ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావు మృతి పట్ల వైసీపీ అధ్యక్షుడు , మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan) దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతిని చూకూరాలని, భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఈ సందర్భంగా రామోజీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
రామోజీరావు మృతిపట్ల టీడీపీ అధినేత చంద్రబాబు (Chandra Babu) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తీరని లోటని, తనకు తీవ్ర ఆవేదనకు గురిచేసిందని పేర్కొన్నారు. పత్రికాధిపతి రామోజీరావు అస్తమయం పట్ల జనసేన అధినేత, నటుడు పవన్‌కల్యాణ్ ( Pawan Kalyan) తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తపరిచారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు.