అమరావతి : ఏపీలోని అనంతపురం జిల్లాలో ఓ ఇంట్లో భారీ చోరీ ( Massive theft ) జరిగింది. కూతురు పెళ్లి కోసం దాచిన నగదుతో పాటు రూ. 3.50 కోట్ల విలువ చేసే బంగారం, వజ్రాలను దొంగలు దోచుకెళ్లారు. అనంతపురం (Anantapur) నగర శివారులో జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
అనంతపురం జిల్లా :
అనంతపురం నగర శివారులో దొంగలు బీభత్సం సృష్టించారు.
కూతురు పెళ్లి కోసం ఉంచిన నగదు, బంగారం, వజ్రాల ఆభరణాలను దోచుకెళ్ళారు. పెళ్లి కార్డులు పంచడానికి వెళ్లిన ఇంట్లో చొరబడి దాదాపు 3 కోట్ల 50 లక్షల విలువచేసే బంగారు నగదు వజ్రాలను దోచుకెళ్లిన ఘటన అనంతపురం లో… pic.twitter.com/kz2qWON9ls— Aadhan Telugu (@AadhanTelugu) January 23, 2025
వెంకట శివారెడ్డి అనే వ్యక్తి నగర శివారులోని బెంగుళూరు హైదరాబాద్ జాతీయ రహదారి ( National Highway) సమీపంలోని విల్లాస్‌లో ఉంటున్నాడు. వచ్చే నెల ఫిబ్రవరిలో కుమార్తె పెళ్లి ( Daughter wedding ) ఉండడంతో బీరువాలోని రూ.20లక్షల నగదుతో పాటు, రూ.3.50కోట్ల విలువైన వజ్రాలు, బంగారు ఆభరణాలు లాకర్లో ఉంచాడు. పెళ్లి కార్డులు బంధువులకు ఇవ్వడానికి వేరే ప్రాంతానికి వెళ్లగా అదును చూసిన దొంగలు ఇంట్లో చొరబడి లాకర్‌ను పగులగొట్టారు. లాకర్లో ఉన్న నగదును, బంగారాన్ని, వజ్రాలను దోచుకెళ్లారు.
వాచ్మెన్ సమాచారంతో ఇంటికి వచ్చిన బాధితుడు లాకర్ పగులగొట్టి ఉండడాన్ని గమనించి పోలీసులకు ( Police) ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల్లో ఫుటేజీని పరిశీలించగా నలుగురు దొంగలు దోపిడికి పాల్పడ్డట్లు పోలీసులు గుర్తించారు. అంతకు ముందు అదే విల్లాలోని మరో రెండు ఇళ్లలోకి చొరబడి దోపిడికి పాల్పడ్డారు.