జగ్గయ్యపేట: ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. జగయ్యపేట మండలం తొర్రగుంటపాలెంలోని మిర్చి కోల్డ్ స్టోరేజీ గోడౌన్లో మంటలు చెలరేగాయి. క్రమంగా అవి గిడ్డంగి మొత్తానికి వ్యాపించడంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. దీంతో మిర్చి నిల్వలు దగ్దమవుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. గోడౌన్లో సుమారు రూ.12 కోట్ల విలువైన మిర్చి నిల్వలు ఉన్నట్లు సమాచారం.
కాగా, గోదామ్‌లో మొత్తం 40 వేల మిర్చి బస్తాలు ఉన్నాయని సమాచారం. అన్నీ కాలిబూడిదయ్యాయి. పొగ, మిర్చి ఘాటుతో పరిసర గ్రామాల ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తుమ్ములు, దగ్గుతో గ్రామస్తులు అవస్తలు పడుతున్నారు.