అమరావతి : మావోయిస్టు (Maoist) పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు , ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి చెల్లూరి నారాయణరావు ( Chelluri Narayana) అలియాస్ సోమన్న ఏపీ డీజీపీ ఎదుట లొంగిపోయారు. ఆయనతో పాటు స్పెషల్ జోనల్ కమిటీ ,డివిజనల్, ఏరియా కమిటీలకు చెందిన మావోయిస్టులు ఆయుధలతో లొంగిపోయారని డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా ( DGP Harish Gupta) మీడియాకు వెల్లడించారు.
ఆంధ్రలో ఎవరూ అండర్‌గ్రౌండ్ క్యాడర్ లేరని తెలిపారు. గణపతి ఆంధ్రలో లేని కారణంగా ఆయన గురించి మాట్లాడడం సరికాదన్నారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా పార్టీ సైద్దాంతిక రాజకీయ స్థాయిని పెంచుకోవడం, అందుకు అనుగుణంగా ఎత్తుగడలు రూపకల్పన చేయకపోవడం , వాస్తవ పరిస్థితులకు సంబంధం లేని నిర్ణయాలు తీసుకోలేక పోవడం వల్ల దేశవ్యాప్తంగా పార్టీకి నష్టం జరిగిందని తెలిపారు. నాటికి నేటికి అటవీ ప్రాంతంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని వివరించారు.