అమరావతి : ఆంధ్రప్రదేశ్( Andhar Pradesh ) లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోగా మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అనకాపల్లి ( Anakapalli) జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలోని బాణసంచా ( Fire works ) తయారీ కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగింది.
దీంతో పరిశ్రమలోని బాణసంచా పేలుడికి ఆరుగురు చనిపోగా, ఆరుగురు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. బాధితులంతా సామర్లకోట వాసులుగా గుర్తించారు. ప్రమాదంపై రాష్ట్ర హోంమంత్రి వంగలపుడి అనిత ( Minitser Anita ) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంటలను ఆర్పేందుకు గాను అగ్నిమాపక సిబ్బందిని మంత్రి అప్రమత్తం చేశారు. అనంతరం ఘటన జరిగిన ప్రాంతానికి మంత్రి బయలు దేరారు. ఆమె క్షతగాత్రులను పరామర్శించనున్నారు.
స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రగాఢ సానుభూతి..
ప్రమాదంలో మరణించిన వ్యక్తుల కుటుంబాలకు ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని నర్సీపట్నం ఆర్డీవోకు స్పీకర్ ఆదేశించారు . నర్సీపట్నం వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి క్షతగాత్రులకు బెడ్లు, వెంటిలేటర్లు ఉంచాలని ఆదేశించారు.