అమరావతి : ఏపీలో సంచలనంగా మారిన గాదె సాయికృష్ణ ( Saikrishna ) మరణంపై శనివారం నుంచి మెజిస్టీరియల్ విచారణ (Magisterial inquiry ) ప్రారంభమయ్యింది . ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ శ్రీనివాసరావు ( Sub Collector Srinivasa Rao ) ఆధ్వర్యంలో మెజిస్టీరియల్ విచారణ కొనసాగుతుంది.
కృష్ణలంక పోలీస్స్టేషన్ సీఐ నాగరాజు ( CI Nagaraju ) ఆధ్వర్యంలో గాదె సాయికృష్ణ అనే యువకుడు లాకప్డెత్లో మరణించాడని సాయికృష్ణ తల్లితో పాటు వైసీపీ నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో స్పందించిన ప్రభుత్వం సిట్ వేసి మెజిస్టీరియల్ విచారణకు ఆదేశాలు జారీ చేయడంతో విచారణ ప్రారంభమైంది.
చట్ట నిబంధనలు, ఎన్హెచ్ఆర్సీ మార్గదర్శకాల మేరకు విచారణ జరపాలని , ప్రజల వద్ద సాక్ష్యాలుంటే విచారణాధికారికి సమర్పించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. కాగా సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి,కుటుంబ సభ్యులు వాంగ్మూలం ఇచ్చారు. పోలీసులే తన బిడ్డను పొట్టనపెట్టుకున్నారని తల్లి విజయలక్ష్మి ఆరోపించింది. పోలీసులకు సాయికృష్ణ గురించి అడిగితే ఫొటోకు దండ వేసుకోమన్నారని ఫిర్యాదు చేశారు.