Srisailam Temple | శ్రీశైలం : ప్రముఖ జ్యోతిర్లింగం, శక్తిపీఠ క్షేత్రమైన శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానం ఈవోగా ఎం శ్రీనివాసరావు నియామకమయ్యారు. దేవాదాయశాఖలో డిప్యూటీ కలెక్టర్‌గా ఉన్న ఆయనను ప్రభుత్వం ఈవోగా నియమిస్తూ దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ఏడాది పాటు డిప్యూటేషన్‌పై ఈవోగా కొనసాగుతారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. కొత్త ఈవో శుక్రవారం బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం శ్రీశైలం దేవస్థానం ఈవోగా చంద్రశేఖర్ ఆజాద్ కొనసాగుతున్నారు. ఆయన నవంబర్ 15న బదిలీ చేసింది. అంతకు ముందు ఆయన రాయలసీమ ఆర్జేసీగా పని చేస్తుండగా.. శ్రీశైలం దేవస్థానం ఈవోగా పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో ఆయన నవంబర్ 15న ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు ఈవోగా పెద్దిరాజు కొనసాగారు. ఆయనను కూటమి ప్రభుత్వం బదిలీ చేసింది. అసిస్టెంట్ కమిషనర్‌గా ఉన్న చంద్రశేఖర్‌రెడ్డికి ఆలయ ఇన్చార్జి ఈవోగా నియమించిన విషయం తెలిసిందే.