తిరుమల : తిరుమల, తిరుపతి దేవస్థానం ( TTD ) బోర్డు భక్తుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే ఏ ఆలయంలో లేని విధంగా భక్తులకు లైఫ్ ఇన్సూరెన్స్ ( Life Insurance ) ను అమలు చేయాలని నిర్ణయించింది. బుధవారం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ( Chairman BR Naidu ) అధ్యక్షతన జరిగిన బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు.
ముఖ్యంగా శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తిరుమలలో సహజ మరణం పొందితే భక్తుని కుటుంబానికి రూ.2 లక్షలు చెల్లించాలని నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రతో చైర్మన్ మీడియాకు వివరించారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తోందని ఆయన తెలిపారు.కలిసి ఛైర్మన్ మీడియాకు వెల్లడించారు.
ఈనెల 15 నుంచి 23వ తేదీ వరకు ముఖ్యాంశాలు తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు , అక్టోబర్ 12 నుంచి 20వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని వెల్లడించారు. ఈ నెల 14వ తేదీ సాయంత్రం 7 గంటలకు అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని వివరించారు.
రిలయన్స్ సంస్థ టీటీడీకి విరాళంగా అందించిన 25 ఎలక్ట్రిక్ బస్సులను సెప్టెంబర్ 16న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారని తెలిపారు. అదే కార్యక్రమంలో 2027 సంవత్సరానికి సంబంధించిన టీటీడీ క్యాలెండర్లు, డైరీలను ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారన్నారు.
భక్తులు, ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, తిరుమలలో ప్రమాదవశాత్తు మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు అందించే బీమాను రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచేందుకు నిర్ణయం తీసుకున్నామని వారు తెలిపారు. ఈ సమావేశంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు, జేఈవోలు డా.ఎ.శరత్, శ ప్రభల గోపినాథ్, సీవీఎస్వో కే వి మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.