పెన్పహాడ్, సెప్టెంబర్ 09 : పెన్పహాడ్ మండల పరిధిలోని రాజుపేట రెవిన్యూ పరిధిలోని రైతులతో అనాజీపురం రైతు వేదికలో బుధవారం భూ భారతి భూ రీ సర్వేపై తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూ భారతి భూ రీ సర్వేకు రైతులు అందరూ సహకరించాలని ఆర్డీఓ వేణుమాధవ్ రావు కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రీ సర్వే వల్ల అనేక రకాలైన భూ సమస్యలు పరిష్కారం అవుతాయని, ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు. ఇట్టి కార్యక్రమానికి రైతులందరూ తమ సహకారం అందజేసి వారి సమస్యల పరిష్కారం చేసుకోవాలని ఈ కార్యక్రమం అత్యంత పారదర్శకంగా చేపట్టడం జరుగుతుందని తెలిపారు.
సరిహద్దు తగాదాలు పూర్తిగా తొలగిపోవడం, డబుల్ రిజిస్ట్రేషన్ మోసాలకు అడ్డుకట్ట పడటం. భూమి కొలతలు పూర్తయ్యాక అప్డేట్ చేసిన డిజిటల్ పత్రాలను ఆన్లైన్ పోర్టల్లో నేరుగా చూసుకునే సదుపాయం. సర్వే నిర్వహించే సమయంలో రైతులు, గ్రామస్తులు స్వయంగా హాజరై, లైసెన్స్ డ్ సర్వేయర్లకు సహకరించి తమ భూముల రికార్డులను, యాజమాన్య హక్కులను సరిచూసుకోవాలని ఆర్డీవో సూచించారు. ఈ కార్యక్రమంలో ఏ.డి.ఈ శ్రీనివాసులు. తాసీల్దార్ రాజశేఖర్ రెడ్డి, సర్పంచ్ అనుముల పూరి నాగయ్య, మార్కెట్ డెరైక్టర్ దామోదర్ రెడ్డి, ఏఎస్ఐ రాములు, ఆర్ ఐ రంజిత్ రెడ్డి. సీనియర్ అస్టెంట్ రాధ పాల్గొన్నారు.