Srisailam | శ్రీశైలం : మొంథా తుఫాను ప్రభావం శ్రీశైల తీవ్రస్థాయిలో కనిపించింది. శ్రీశైలం మండలంలో గడిచిన 24 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో జనజీవన స్తంభించింది. భ్రమరాంబ మల్లికార్జున స్వామివారల దర్శానికి వచ్చిన భక్తులు వర్షం కారణంగా వసతి గదులకే పరిమితమయ్యారు. మరోవైపు శ్రీశైలం పాతాళగంగ మెట్ల మార్గంపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. దాంతో మూడు షాపులు ధ్వంసం అయ్యాయి. రాత్రి సమయంలో కొండచరియలు విరిగిపడడంతో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. భారీగా కొండ చర్యలు విరిగిపడుతుండడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. అదే సమయంలో వరద నీరు భారీగా ప్రవహిస్తుండడంతో రోడ్డు కోతకు గురైంది. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. కోత ఇలాగే కొనసాగితే పాతలగంగా మెట్ల మార్గంలో భారీ ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు.
