రిజిస్ట్రేషన్ల కోసం పరుగులు పెడుతున్న ప్రజలు!
Land Value | హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తేతెలంగాణ): ఆంధ్రప్రదేశ్లో భూముల మార్కెట్ ధరలు పెరుగుతాయని జోరుగా ప్రచారం జరుగుతున్నది. దీంతో శుక్రవారం సబ్ రిజిస్టార్ కార్యాలయాలు ప్రజలతో కిటకిటలాడాయి.
భూముల మార్కెట్ రేట్ పెరిగితే రిజిస్ట్రేషన్ చార్జీలు కూడా పెరుగుతాయనే కారణంతో ప్రజలు రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి పరుగులు పెడుతున్నారు. ఈ నెల 30న సీసీఎల్ఏలో కీలక సమావేశం జరగనున్నది. భూముల మార్కెట్ ధర పెంపుపై ఈ సమావేశంలో చర్చించే అవకాశమున్నది.