సైనిక లాంఛనాలతో లాన్స్ నాయక్ సాయితేజ అంత్యక్రియలు పూర్తి..

అమరావతి : హెలికాప్టర్ దుర్ఘటనలో మృతి చెందిన లాన్స్ నాయక్ సాయితేజ అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో ముగిసాయి. పార్థివదేహాన్ని బెంగళూరు నుంచి ఆదివారం ఉదయం చిత్తూరు జిల్లా ఎగువరేగడ పల్లెకు తరలించారు. వలసపల్లి నుంచి ఎగువ రేగడ పల్లె వరకూ 30కిలోమీటర్ల వరకు అంతిమ యాత్ర కొనసాగింది. యువకులు దారిపోడవునా జాతీయజెండాలను చేతబట్టి సాయితేజ అమర్‌రహే అంటూ నినాదాలు చేశారు.
పార్థివదేహం తరలిస్తున్న వాహనంపై పూలవర్షం కురిపించి ఘనంగా నివాళి అర్పించారు.కడసారిగా ఆయన పార్ధివదేహాన్ని చూసేందుకు గ్రామస్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సాయితేజ ఇంటి వద్దకు పార్థివదేహాన్నితీసుకురాగా అతడి కుటుంబ సభ్యులు పార్థివదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యరు. ఒక్కసారిగా వారి రోధనలు మిన్నంటాయి. అక్కడి నుంచి మైదానంలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. అనంతరం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

