తిరుమల : టీటీడీ ముఖ్య నిఘా, భద్రతాధికారిగా( TTD CVSO) కేవీ మురళీకృష్ణ ( Murali Krishna ) గురువారం తిరుమల శ్రీవారి ఆలయంలో బాధ్యతలు( Charge ) స్వీకరించారు. ముందుగా వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న సీవీఎస్వో రంగనాయకులు మండపంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు సీవీఎస్వోకు తీర్థ ప్రసాదాలను అందించారు.ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు సీవీఎస్వో వెంకట శివకుమార్ రెడ్డి, వీజీవోలు రామ్ కుమార్, సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల, తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 25 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 16 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 78,288 మంది భక్తులు దర్శించుకోగా 32,079 మంది తలనీలాలు సమర్పించుకున్నార. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3.67 కోట్లు ఆదాయం వచ్చిందని వివరించారు.