Tirumala | తిరుమలలో వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
Tirumala | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి సన్నిధిలో బుధవారం ఆణివార ఆస్థానం జరుగనున్నది. ఈ క్రమంలో మంగళవారం ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు.
Tirumala | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి సన్నిధిలో బుధవారం ఆణివార ఆస్థానం జరుగనున్నది. ఈ క్రమంలో మంగళవారం ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో సీహెచ్ వెంకటయ్య చౌదరిలతో కలిసి ఈవో జే శ్యామలరావు మీడియాతో మాట్లాడారు. సంవత్సరంలో నాలుగుసార్లు అనగా ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాలకు ముందు వచ్చే మంగళవారం రోజున కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంగా కడిగినట్లు వివరించారు.
స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచి, శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులను దర్శనాలకు అనుమతించారు. ఈ సందర్భంగా అష్టదళపాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, భాను ప్రకాష్ రెడ్డి, నరేష్ కుమార్, శాంతా రామ్, సదా శివరావు, జంగా కృష్ణ మూర్తి, జానకి దేవి, మహేందర్ రెడ్డి, సీవీఎస్వో మురళీకృష్ణ, డిప్యూటీ ఈవో లోకనాథం తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Deverakonda | ఢిల్లీ హైకోర్టులో విజయ్ దేవరకొండకు ఊరట.. వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ కోర్టు తీర్పు
Nani Movie | గ్యాంగ్‌స్టర్ మోడ్‌లోకి నాని.. సుజీత్ దర్శకత్వంలో ‘బ్లడీ రోమియో’ షూటింగ్ షురూ!
Sharjah | భారతీయ సిబ్బంది ఉన్న చమురు ట్యాంకర్‌పై డ్రోన్ దాడి.. అందరూ సురక్షితం
Abhijeet Dipke: సీజేపీ నేత అభిజీత్ దీప్కే నానమ్మ మృతి
Gajwel MRO | నువ్వు ఇంకా పురుగుల మందు తాగలేదా..? రైతును ఎమ్మార్వో ఎలా అవహేళన చేశాడో చూడండి.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

