హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ) : తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 9న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. 16న ఆణివార ఆస్థా నం సందర్భంగా వారం రోజుల ముం దుగా ఆలయంలో తిరుమంజనం జరుపడం ఆనవాయితీగా వస్తుందని టీటీడీ అర్చకులు తెలిపారు.
అదేవిధంగా వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతున్నట్లు అధికారులు చెప్పా రు. శుక్రవారం స్వామివారిని 63,826 మంది భక్తులు దర్శించుకున్నారని, కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.23 కోట్లు వచ్చిందని వెల్లడించారు.