Vande Bharat | ఏపీలోని మరో రైల్వే స్టేషన్లో కూడా వందేభారత్ రైలు ఆగనుంది. కాచిగూడ ( Kachiguda )నుంచి యశ్వంత్పూర్ ( Yesvatpur ) మధ్య నడిచే వందే భారత్ రైలును ఇకపై నందమూరి బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురంలో కూడా ఆపాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. ఈ విషయాన్ని హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి తెలిపారు.
కాచిగూడ-యశ్వంత్పూర్ మధ్య నడిచే వందేభారత్ రైలును హిందూపురంలో ఆపాలని ఎప్పట్నుంచో ప్రజలు కోరుకుంటున్నారు. దీంతో ఈ విషయాన్ని ఎంపీ పార్థసారథి పలుమార్లు రైల్వే శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. హిందూపురంలో వందేభారత్ రైలును ఆపాలను విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో సానుకూలంగా స్పందించిన రైల్వే శాఖ అధికారులు.. హిందూపురంలో వందేభారత్ రైలును ఆపేందుకు అంగీకరించారు. దీనికి సంబంధించిన ఆర్డర్ కాపీని ఎంపీ బీకే పార్థసారథి ఫేస్బుక్లో పంచుకున్నారు. ప్రస్తుతానికి అనుమతి మాత్రమే వచ్చిందని.. ఎప్పట్నుంచి రైలును ఆపుతారనేది త్వరలోనే తెలియజేస్తామని చెప్పారు.
కాచిగూడ- యశ్వంత్పూర్ వందేభారత్ రైలు ప్రస్తుతం మహబూబ్నగర్, కర్నూలు సిటీ, అనంతపురం, ధర్మవరం స్టేషన్లలో ఆగుతుంది. రైల్వే శాఖ నిర్ణయంతో ఇకపై హిందూపురంలో కూడా వందేభారత్ ఆగనుంది.
Hindupur