అమరావతి : ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul ) ఏపీ ఎన్నికల సంఘం తీరుపై నిరసన తెలిపారు. సీఈవో కార్యాలయం మెట్లపై కూర్చుని అధికారుల వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘం ముఖ్య అధికారి ముకేశ్‌కుమార్ మీనా ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలకు(Political parties) ఎన్నికల మార్గదర్శకాలను వివరించేందుకు సమావేశానికి రావాలని ఆహ్వానించింది.
అయితే ప్రజాశాంతి పార్టీకి ఎందుకు ఆహ్వానించలేదని పేర్కొంటూ పార్టీ ప్రధాన కార్యదర్శి మమతా రెడ్డితో కలిసి కేఏ పాల్ విజయవాడలోని సీఈవో కార్యాలయానికి చేరుకున్నారు. అయిఏత అనుమతి లేదంటూ కేఏ పాల్‌ను అడ్డుకోవడంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం అతడిని లోనికి కార్యాలయంలోకి వెళ్లి కూర్చున్నారు. అక్కడి నుంచి బయట కూర్చోవాలని అనడంతో బయటకు వచ్చి నిరసన తెలిపారు.
‘ ప్రపంచాన్ని శాసించి వచ్చాను. నేను ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నా. ఇన్విటేషన్ ఎందుకు పంపలేదు. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) నుంచి తమ పార్టీ పోటీ చేస్తుంది, తాను విశాఖ పట్నం నుంచి పోటీ చేస్తున్నానని ఏడాది క్రితమే ప్రకటించానని’ వెల్లడించారు. శాంతియుతంగా అడుగుతుంటే లోపల కూర్చోమన్నారు. అక్కడి నుంచి బయట ఉండాలని అన్నారు. రిసెప్షన్లో కూర్చోమన్నారు. ఫొన్లో మాట్లాడాలని ఒకరు అన్నారు. వాట్ ఈస్ దిస్ అంటూ అసహనం వ్యక్తం చేశారు.