(Bosta and JC) విజయనగరంలో జిల్లా జాయింట్ కలెక్టర్ తీరు చర్చనీయాంశంగా మారింది. కొత్త సంవత్సరంను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో ఉన్న మంత్రిని కలుసుకుని శుభాకాంక్షలు చెప్పేందుకు వెళ్లిన జాయింట్ కలెక్టర్.. ఉండబట్టలేక మంత్రి దంపతుల కాళ్లకు దండం పెట్టుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
కొత్త సంవత్సరం సందర్భంగా విజయనగరం జిల్లా కేంద్రంలో మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటి వద్ద పార్టీ శ్రేణులు, అభిమానులు, అధికారులు పెద్ద సంఖ్యలో వచ్చారు. పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఇంతలో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) సీహెచ్ కిషోర్ కుమార్ అక్కడికి వచ్చి మంత్రికి పుష్పగుచ్ఛం అందించి బొత్సతోపాటు ఆయన సతీమణి ఝాన్సీ కాళ్లకు దండం పెట్టుకున్నాడు. ఒక ఐఏఎస్ అధికారి మంత్రికి, అతడి భార్య కాళ్లకు దండం పెట్టడం ఏంటని పలువురు చర్చించుకుంటున్నారు. ఈ చర్య జిల్లాలో కింద స్థాయి ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారింది.
చర్మంపై దద్దుర్లు, దురద ఉంటే.. ఒమిక్రాన్ కావచ్చు..?!
గాడిద పాలు ఆరోగ్యానికి మంచివేనా ? వాటికి ఎందుకంత డిమాండ్ ?
శృంగారంపై ఆసక్తి తగ్గిపోయిందా.. అయితే ఈ ఫుడ్స్ తీసుకోండి..
జుట్టు రాలడం ఆగాలంటే ఏం చేయాలి.. రోజూ షాంపూ పెట్టొచ్చా ?
ఉదయాన్నే ఈ ద్రావణం తాగితే అదుపులో డయాబెటిస్..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..