Polavaram | పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి చంద్రబాబు ప్రభుత్వం తప్పిదమే కారణమని వైసీపీ చేసిన ఆరోపణలపై టీడీపీ తీవ్రంగా మండిపడింది. 2019లో మొదటిసారి పోలవరం వెళ్లి, డయాఫ్రం వాల్ ఎక్కడ ? కనిపించదే అని అడిగిన మహా ఘనుడు, ఈ కట్ డ్రాయర్ ఎమ్మెల్యే అని జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలవరం తీసుకెళ్లి బెట్టింగ్‌లు ఆడేవాడికి, రికార్డింగ్ డ్యాన్సులు చేసే వాడి చేతిలో పెట్టారని విమర్శించింది.
రాష్ట్రానికి, పోలవరానికి పట్టిన శని జగన్ రెడ్డి అని టీడీపీ విమర్శించింది. తన స్వార్థం కోసం, తన సైకో బుద్ధితో 18 నెలల పాటు ప్రాజెక్ట్ లో చేయాల్సిన పనులు చేయకుండా, డయాఫ్రం వాల్ దెబ్బతినేలా చేసిన దుర్మార్గుడు జగన్ అని ఆరోపించింది. ఇదే విషయాన్ని నీతి ఆయోగ్ నియమించిన ఐఐటీ హైదరాబాద్ నిపుణుల కమిటీ కూడా నిర్ధారించిందని తెలిపింది. పోలవరం ప్రాజెక్టులో జరిగిన తప్పిదాలను ఎత్తిచూపేందుకు నీతి ఆయోగ్ నియమించిన నిపుణుల కమిటీ, నాటి జగన్ రెడ్డి ప్రభుత్వ అసమర్థ ప్రణాళికతోనే డయాఫ్రం వాల్ దెబ్బతిందని నివేదిక ఇచ్చిందని చెప్పింది. డయాఫ్రం వాల్, ఎగువ కాఫర్ డ్యాం, దిగువ కాఫర్ డ్యాంలు, కేవలం పనులు చేయకుండా తాత్సారం చేసినందుకే కొట్టుకుపోయాయని తేల్చిందని పేర్కొంది.
కాంట్రాక్టర్ ని మార్చటం, సరైన సమయంలో తగినంత పనులు చేయకపోవడం, వ్యూహాత్మక ప్రణాళిక లేకపోవడం, సమన్వయ లోపం, తరచూ డిజైన్లు మార్చడం వంటి కారణాలతో, పోలవరం దెబ్బతిందని ఆ కమిటీ తేల్చిందని టీడీపీ తెలిపింది. 2019లో 13.95 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా డయాఫ్రం వాల్‌కు ఎలాంటి నష్టం వాటిల్లలేదని, అప్పుడు పనులు చేయకుండా వదిలేయటంతో, 2020లో వచ్చిన వరదకు ప్రధాన డ్యాం వద్ద మూడు ప్రదేశాల్లోను, దిగువ కాఫర్ డ్యాంలోను విధ్వంసం సృష్టించిందని కమిటీ పేర్కొంటూ ఎగువ కాఫర్ డ్యాంలలో గ్యాప్‌లను సకాలంలో మూసివేయకపోవడం వల్లే డయాఫ్రం వాల్‌కు ఇలా అయ్యిందని తేల్చిందని పేర్కొంది. ఒక అసమర్ధుడు, ఒక అజ్ఞాని, ఒక చేత కానివాడికి తోడుగా, గంట- అరగంట మంత్రులు ఉంటే, పోలవరం ఇలా కాక ఇంకా ఎలా ఉంటుందని ఆగ్రహం వ్యక్తంచేసింది.