(Jagan Prayers) కడప జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జిల్లాలోని అన్ని చర్చీలు విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ఏపీ సీఎం జగన్ పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో ప్రార్థనలు జరిపారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన జగన్.. అక్కడ ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం కేక్ కట్ చేసిన జగన్.. అక్కడికి వచ్చిన వారితో కొద్దిసేపు ఆప్యాయంగా మాట్లాడారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా అందరికీ మంచి జరుగాలని ఆకాంక్షించారు.
విజయవాడలోని నొవాటెల్ హోటల్లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొన్నారు. హోటల్‌కు చేరుకున్న బిషప్‌లు, క్రైస్తవ మతపెద్దలు క్రిస్మస్ సందర్భంగా సీజేఐతో కేక్ కట్ చేయించారు. బిషప్‌లకు జస్టిస్ ఎన్వీరమణ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ తినిపించారు. వేడుకల్లో ఏపీ, తెలంగాణ హైకోర్టు సీజేలు, జడ్జిలు, తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నొవాటెల్ హోటల్లో బస చేసిన సీజేఐ ఎన్వీ రమణను ప్రముఖులు కలిశారు.
కనురెప్పల అందానికి వంటింటి చిట్కాలు.. అవి ఏంటో తెలుసా..?
చేపలను తరచూ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలివే..!
మన శరీరానికి ఎంత సీ విటమిన్ అవసరం? నిపుణులేమంటున్నారు..
జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే 7 చిట్కాలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..