Prabhas | ‘కమ్ టు మై రూం’ నాగీ.. ‘సింగ్ గీతం’ చూసి నాగ్ అశ్విన్‌పై ప్రభాస్ సరదా సెటైర్లు
Sing Geetham | టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ‘సింగ్ గీతం’ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ వైజయంతి మూవీస్ పతాకంపై నిర్మించిన సంగతి తెలిసిందే.
Sing Geetham | టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ‘సింగ్ గీతం’ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ వైజయంతి మూవీస్ పతాకంపై నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రస్తుతం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుండగా.. ఇటీవల ఈ చిత్రాన్ని వీక్షించిన రెబల్ స్టార్ ప్రభాస్, దర్శక నిర్మాత నాగ్ అశ్విన్‌ను సరదాగా నిలదీశారు. సినిమా చూసిన వెంటనే నాగ్ అశ్విన్‌ను తన రూమ్‌కు పిలిపించుకున్న ప్రభాస్, మొదట చాలా సీరియస్‌గా “కమ్ టు మై రూం” అంటూ కబురు పెట్టారట. దాంతో ఏదో జరిగిందేమో అని నాగ్ అశ్విన్ కంగారుపడ్డారు. అయితే రూమ్‌లోకి వెళ్లిన తర్వాత ప్రభాస్ ఒక్కసారిగా మూడ్ మార్చేసి సరదా ప్రశ్నలతో నాగీని ఆటపట్టించారు.
“నా వాయిస్‌లో ఏదైనా సమస్య ఉందా? నాకు పాటలు పాడటం రాదనుకున్నావా? నేను ఇప్పటి వరకు ప్రయోగాలు చేయలేదా? మరి నన్నెందుకు ‘సింగ్ గీతం’లో పెట్టుకోలేదు?” అంటూ ప్రభాస్ చమత్కారంగా ప్రశ్నించడంతో అక్కడున్నవారంతా నవ్వులు పూయించారు. ‘కల్కి 2898 AD’ వంటి భారీ ప్రాజెక్ట్ తర్వాత ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబినేషన్లో మళ్లీ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ ఫన్నీ సంభాషణ మరింత కిక్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫన్నీ ప్రమోషనల్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రభాస్ టైమింగ్, నాగ్ అశ్విన్ రియాక్షన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

