శనివారం 27 ఫిబ్రవరి 2021
Andhrapradesh-news - Jan 18, 2021 , 07:56:22

ఏపీలో కొత్త ఎస్‌ఈసీ కోసం అన్వేషణ

ఏపీలో కొత్త ఎస్‌ఈసీ కోసం అన్వేషణ

నిమ్మగడ్డ స్థానంలో నీలం సాహ్నీకి ఛాన్స్‌?

హైదరాబాద్‌, జవవరి 17 (నమస్తే తెలంగాణ): ఏపీలో కొత్త ఎన్నికల కమిషనర్‌ కోసం జగన్‌ సర్కార్‌ అన్వేషణ సాగిస్తున్నది. ప్రస్తుత ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ స్థానంలో కొత్త వ్యక్తిని నియమించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారుల పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తున్నది. ఇందులో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. నిమ్మగడ్డ పదవీకాలం మార్చి 31న ముగియనున్నది. నిమ్మగడ్డ పునర్నియామకంతో ఎస్‌ఈసీ పదవి నుంచి అర్థాంతరంగా వైదొలిగిన తమిళనాడు హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ కనగరాజ్‌కు మళ్లీ అవకాశం ఇవ్వవచ్చనే ప్రచారం కూడా జరుగుతున్నది.

VIDEOS

logo