అమరావతి : వైఎస్సార్ కుటుంబంలో ఆస్తుల తగాదా రోజురోజుకూ ముదురుతుంది. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ (YS Jagan), అతడి చెల్లెలు ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ( Sharmila ) మధ్య ఆస్తుల పంపకంపై బహరింగ యుద్ధం జరుగుతుంది. ఈ సందర్భంగా వైఎస్సార్ అభిమానులు వాస్తవాలను గ్రహించాలంటూ మూడు పేజీల లేఖను(Letter) శుక్రవారం విడుదల చేశారు.
జగన్ ఏదైనా నమ్మించగలడంటూ లేఖను ప్రారంభించిన ఆమె వైఎస్ రాజశేఖర్రెడ్డి బతికున్న కాలం నుంచి నేటి వరకు జరిగిన ఆస్తుల విషయంలో జరిగిన అంశాలను ఆమె ప్రస్తావించారు. రాజశేఖర్రెడ్డి(Rajashekar Reddy) స్థాపించిన అన్ని వ్యాపారాలు కుటుంబ వ్యాపారాలేనని, వాటికి జగన్మోహన్ రెడ్డి సొంతం కాదని, ఉన్న అన్ని కుటుంబ వ్యాపారాలకు జగన్ గార్డియన్ మాత్రమేనని స్పష్టం చేశారు.
ఈరోజు పొద్దున సాక్షి పేపర్ చూశాను. సాక్షి మీడియా జగన్ మోహన్ రెడ్డి గారి చేతిలో ఉంది. కాబట్టి ఏదైనా నమ్మించగలడు. అయినా YSR అభిమానులకు అసలు వాస్తవాలు తెలియజేసే ప్రయత్నం నాది. pic.twitter.com/8ASB8jusrI
— YS Sharmila (@realyssharmila) October 25, 2024
వైఎస్సార్ బ్రతికి ఉన్నంత వరకు ఏ ఒక్క ఆస్తి (Asset) పంపకం కూడా జరగలేదని, ఈరోజు వరకు నాకు న్యాయంగా రావాల్సిన ఒక ఆస్తి కూడా నా చేతుల్లో లేదని వాపోయారు. నాన్న చనిపోయిన తరువాత జగన్ ఇబ్బందులు పడితే నా శక్తికి మించి సహాయం చేశానని, ఆయన స్థాపించిన పార్టీని ఏ స్వార్థం లేకుండా నా భుజాల మీద మోశానని పేర్కొన్నారు.
జగన్ సీఎం అయిన వెంటనే గుర్తు పట్టలేనంతగా మారిపోయారు..
2019లో జగన్ సీఎం అయిన వెంటనే గుర్తు పట్టలేనంతగా మారిపోయారని లేఖలో ఆరోపించారు. సీఎం అయిన నెలరోజులకే విడిపోదాం అంటూ ఇజ్రాయిల్ పర్యటనలో ప్రతిపాదన పెట్టారని అన్నారు. అమ్మ విజయలక్ష్మి మీద ఎన్సీఎల్టీలో కేసు పెట్టిన విషయం బయటకు వస్తే కుటుం ప్రతిష్ట బజారున పడుతుందన భయంతో తాము మాట్లాడలేదని అన్నారు. ఒక కుమారుడు తన తల్లికి తీసుకురాకూడని పరిస్థితిని తీసుకువచ్చారని విమర్శించారు. కుటుంబ బంధం, స్నేహ బంధంతో మనుషులు ఒక్కటవుతారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్సార్ బంధం ఏర్పరుచుకున్న ప్రతి వైఎస్సార్ బంధువుకి వివరణ ఇస్తున్నానని వెల్లడించారు .