IRCTC | భక్తులకు ఐఆర్సీటీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రముఖ పుణ్యక్షేత్రాలైన తిరుపతి, షిర్డీ మధ్య ప్రత్యేక రైలు సర్వీసులను నడిపించాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఈ రెండు సిటీల మధ్య 18 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 3వ తేదీ నుంచి సెప్టెంబర్ 29 వరకు ఈ రైల్వే సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపింది.
ప్రత్యేక రైళ్లు నడిచే షెడ్యూల్ ఇదే..
– ప్రతి ఆదివారం ఉదయం 4 గంటలకు తిరుపతి నుంచి తిరుపతి-సాయినగర్ షిర్డీ రైలు (07637) బయల్దేరి, మరుసటి రోజు ఉదయం10.45 గంటలకు షిర్డీ చేరుకోనుంది. ప్రతి సోమవారం రాత్రి 7.35 గంటలకు షిర్డీ-తిరుపతి రైలు (07638) బయల్దేరి, మంగళవారం అర్ధరాత్రి 1.30 గంటలకు తిరుపతి చేరుకోనుంది. ఆగస్టు 3వ తేదీ నుంచి సెప్టెంబర్ 29 వరకు ప్రతి వారం ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి.
స్పెషల్ రైళ్లు ఆగే స్టేషన్ల జాబితా
రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్, లింగంపల్లి, వికారాబాద్, జహీరాబాద్, బీదర్, బాల్కి, ఉద్గిర్, లాతూర్ రోడ్డు, పర్లి, గంగఖేర్, పర్బని, సేలు, జాల్నా, ఔరంగాబాద్, నాగర్సోల్, మన్మడ్, కోపర్గావ్ స్టేషన్లలో ఆగనుంది.