శ్రీశైలం : నంద్యాల జిల్లా శ్రీశైలం (Srisailam) మల్లికార్జునస్వామిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. వరుస సెలవుల కారణంగా ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు.
ఆలయ పవిత్రతను కాపాడేందుకు ఆలయ పరిసర ప్రాంతాలకు మద్యం(Liquor) , మాంసం (Meat) తీసుకురాకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఆదివారం సీఐ ప్రసాద్ రావు ఆధ్వర్యంలో ఆలయ ముఖద్వారం వద్ద వాహనాలను ( Vehicles check ) తనిఖీ చేశారు.
వాహనాలకు సంబంధించిన సరైన పత్రాలు లేని వాహనదారులకు జరిమానా విధించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ గురవయ్య, కానిస్టేబుళ్లు రఘునాథ్, బాలకృష్ణ, మహేశ్, శివమహేంద్ర రెడ్డి, నాను నాయక్ తదితరులున్నారు.