Srisailam | ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద కొనసాగుతున్నది. దాదాపు 4లక్షల క్యూసెక్కులకుపైగా వరద పోటెత్తుతున్నది. దీంతో అధికారులు డ్యామ్ పది క్రస్ట్ గేట్లను 15 అడుగుల మేరకు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు క్రస్ట్ గేట్ల ద్వారా 2,42,628, విద్యుదోత్పత్తి ద్వారా మరో 20,824 క్యూసెక్కుల వరద వస్తున్నది. అలాగే, సుకేశుల జలాశయం నుంచి 1,37,099 క్యుసెక్కులు వరద శ్రీశైలానికి చేరుతున్నది. ప్రస్తుతం జలాశయానికి మొత్తం 4,00,491 క్యుసెక్కుల వరద వస్తోన్నది. ఆదివారం సాయంత్రం వరకు రిజర్వాయర్‌కు 4,87,451 క్యుసెక్కుల ఇన్‌ఫ్లో ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం జలాశయం నుంచి క్రస్ట్ గేట్ల ద్వారా 9,69,250 క్యుసెక్కులు సాగర్‌కు విడుదల చేస్తున్నారు. కుడిగట్టు, ఎడమగట్టు విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నది. విద్యుత్ కేంద్రాల ద్వారా 58,461 క్యూసెక్కుల వరద దిగుకు వెళ్తున్నది. భారీ వరదతో సాగర్ నిండుకుండను తలపిస్తున్నది. సోమవారం ఉదయం 8 గంటలకు సాగర్ గేట్లను ఎత్తివేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.