Deputy CM Bhatti | వచ్చే ఏడాది మార్చి నాటికి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తి జరగాలి : భట్టి
Deputy CM Bhatti | వచ్చే ఏడాది మార్చి కల్లా ఎట్టి పరిస్థితిలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరగాల్సిందేనని, అందుకు ఏర్పాట్లు చేసుకోవాలని జెన్కో అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు.
Deputy CM Bhatti | వచ్చే ఏడాది మార్చి కల్లా ఎట్టి పరిస్థితిలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరగాల్సిందేనని, అందుకు ఏర్పాట్లు చేసుకోవాలని జెన్కో అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. సచివాలయంలో జెన్కో ఉన్నతాధికారులతో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పనుల ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి యూనిట్ అక్టోబర్ 30.. ఐదో యూనిట్‌ను వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ప్లాంట్‌లో పనిచేసే కొద్దిమంది అధికారులు, సిబ్బంది జ్వరాలతో బాధపడుతున్నారని.. ఫలితంగా పనుల్లో కొంత జాప్యం జరుగుతున్నట్లు సమావేశంలో అధికారులు వివరించారు. సిబ్బంది సంక్షేమమే ప్రధానమని.. వెంటనే మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని.. దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అధికారులు, కార్మికుల భద్రతకు ఎన్ని నిధులు ఖర్చు చేసేందుకైనా వెనుకాడొద్దని సూచించారు. అధికారులు, కార్మికులు స్థానికంగా నివసించేందుకు వెంటనే క్వార్టర్ల నిర్మాణానికి టెండర్లు పిలవాలని ఆదేశించారు. స్థానికంగా నివసించేందుకు ఇబ్బందులు ఉన్నందున క్వార్టర్లు నిర్మించే వరకు మిర్యాలగూడ, దామరచర్ల నుంచి సిబ్బందిని తరలించేందుకు ప్రత్యేక బస్సులు అధికారులు సిబ్బందికి ఏర్పాటు చేయాలని చెప్పారు. యాదాద్రి పవర్ ప్లాంట్ నుంచి బూడిద తరలింపునకు తాళ్ల వీరప్పగూడెం, దామరచర్లకు నాలుగు వరుసల బైపాస్ రోడ్డు నిర్మాణం ప్రగతిపై వారంలోగా తనకు నివేదిక సమర్పించాలన్నారు. త్వరలో ప్లాంట్‌ను సందర్శించి.. అధికారులు, సిబ్బందితో భేటీ అవుతానని తెలిపారు. సమావేశంలో ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి రోనాల్డ్ రాస్, జెన్కో డైరెక్టర్లు అజయ్, సచ్చిదానందం, వైటీపీఎస్ చీఫ్ ఇంజినీర్ సమ్మయ్య, ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాస్, డిప్యూటీ స్పెషల్ సెక్రెటరీ కృష్ణ భాస్కర్, ఎస్పీడీసీఎల్ సీఎండి ముషారఫ్, ఎన్పీడీసీఎల్ సీఎండి వరుణ్ రెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

