అమరావతి : ఇంద్రకీలాద్రి (Indrakiladri ) పై కొలువుదీరిన కనక దుర్గాదేవి మంగళవారం మహాలక్ష్మి దేవి (Mahalaxmi Devi) అలంకారం లో భక్తులకు దర్శనం ఇచ్చింది. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారు జామునుంచే బారులు దీరారు. దసరా ( Dussehra ) నవరాత్రి ఉత్సవాలు ఆరో రోజు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు.
ఈ సందర్భంగా ఆలయ అధికారులు, పోలీసులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా బందోబస్తును నిర్వహించారు. నవరాత్రులలో ఏడవ రోజు బుధవారం మూల నక్షత్రం కావడంతో అమ్మవారు సరస్వతి దేవి అలంకారం లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. అమ్మవారికి రేపు మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్య ప్రభుత్వం తరపున ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.