అమరావతి : దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రిలోని(Indrakiladri ) దుర్గగుడి భారీ ఎత్తున ఆదాయం (Income) సమకూరింది. దాదాపు రూ. 9.31 కోట్లు ఆదాయం హుండీకి (Hundi) వచ్చిందని ఆలయ అధికారులు వెల్లడించారు. మూడు విడతలుగా లెక్కించిన వివరాలను ప్రకటించారు. మొదటి విడతగా లెక్కించిన హుండీలో రూ. 3.50 కోట్లు ఆదాయం వచ్చినట్లు వివరించారు.
రెండో విడతలో రూ. 2.76 కోట్లు, మూడో విడతలో రూ. 3.05 కోట్లు కానుకల రూపేణా వచ్చినట్లు ఆలయ ఈవో రామారావు (EO Ramarao) తెలిపారు. వీటితో పాటు 733 గ్రాముల బంగారం, 25.705 కిలోల వెండి వస్తువులను భక్తులు అమ్మవారికి సమర్పించుకున్నారని పేర్కొన్నారు.