Indian student | అమెరికాలో హత్యకు గురైన తెలుగు విద్యార్థి.. ఈ ఏడాది తొమ్మిదో ఘటన..!
Indian student | అగ్రరాజ్యం అమెరికా (America)లో మరో తెలుగు విద్యార్థి (Indian student) హత్యకు గురయ్యాడు.
Indian student | అగ్రరాజ్యం అమెరికా (America)లో మరో తెలుగు విద్యార్థి (Indian student) హత్యకు గురయ్యాడు. 20 ఏళ్ల విద్యార్థి మృతదేహాన్ని అధికారులు సమీపంలోని అటవీ ప్రాంతంలో గుర్తించారు.
మీడియా కథనాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా బుర్రిపాలెంకు (Burripalem, Guntur) చెందిన 20 ఏళ్ల పరుచూరి అభిజిత్ (Paruchuri Abhijit) ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. అక్కడ బోస్టన్ యూనివర్సిటీ (Boston University)లో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. అయితే అతడు క్యాంపస్‌లోని అటవీ ప్రాంతంలో శవమై కనిపించాడు. వర్సిటీ క్యాంపస్‌లో విద్యార్థి శవమై కనిపించడం పలు ప్రశ్నలకు తావిస్తోంది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డబ్బు, ల్యాప్‌టాప్ కోసమే అభిజిత్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు.
కాగా, బుర్రిపాలెంకు చెందిన పరుచూరి చక్రధర్, శ్రీలక్ష్మి దంపతులకు అభిజిత్ ఒక్కగానొక్క కొడుకు. అభిజిత్ చిన్నతనం నుంచే చదువులో ముందుండేవాడు. విదేశాల్లో చదువుకోవాలనే అతడి నిర్ణయాన్ని మొదట్లో తల్లి శ్రీలక్ష్మి వ్యతిరేకించినప్పటికీ.. కొడుకు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తన నిర్ణయం మార్చుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో ఉన్నత చదువుల కోసం అమెరికా పంపినట్లు చెప్పారు. తాజాగా ఒక్కగానొక్క కొడుకు హత్యకు గురయ్యాడని తెలియగానే పరుచూరి అభిజిత్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
కాగా, ఇటీవలే అమెరికాలో తెలుగు విద్యార్థులు వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఉన్నత చదువుల కోసం అగ్రరాజ్యం వెళ్లిన విద్యార్థులు ఒకరి తర్వాత ఒకరు అనుమానాస్పద స్థితిలో శవమై కనిపిస్తున్న దృశ్యాలు ఇటీవలే అనేకం వెలుగు చూస్తున్నాయి. అమెరికాలో భారత సంతతికి చెందిన విద్యార్థి మరణించడం ఈ ఏడాది (2024)లో ఇది తొమ్మిదో ఘటన కావడం గమనార్హం.
Also Read..
Alexei Navalny | నావల్నీని విడుదల చేయాలనుకున్నాం.. అంతలోనే ఇలా జరిగిపోయింది : పుతిన్
Prakash Raj | 420లు 400 సీట్లు గెలుస్తామంటున్నారు.. బీజేపీపై ప్రకాశ్ రాజ్ తీవ్ర వ్యాఖ్యలు
Cheetah cubs | ఐదు కాదు.. ఆరు కూనలకు జన్మనిచ్చిన దక్షిణాఫ్రికా చిరుత గామిని
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

