Prakash Raj | 420లు 400 సీట్లు గెలుస్తామంటున్నారు.. బీజేపీపై ప్రకాశ్ రాజ్ తీవ్ర వ్యాఖ్యలు
Prakash Raj | కేంద్రంలోని అధికార బీజేపీ (BJP)పై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘420’లు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో (Lok Sabha elections) 400 సీట్లు గెలుస్తామని అంటున్నారని, ఇవి అహంకారంతో కూడిన వ్యాఖ్యలని మండిపడ్డారు.
Prakash Raj | కేంద్రంలోని అధికార బీజేపీ (BJP)పై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘420’లు (మోసానికి పాల్పడినవారు) వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో (Lok Sabha elections) 400 సీట్లు గెలుస్తామని అంటున్నారని, ఇవి అహంకారంతో కూడిన వ్యాఖ్యలని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఒకే పార్టీ 400 కంటే ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. కర్ణాటకలోని చిక్కమంగళూరులో ఆదివారం మీడియాతో ప్రకాశ్ రాజ్ మాట్లాడారు. ప్రధాని మోదీ, బీజేపీ పేరు ప్రస్తావించకుండా తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.
‘లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లు సాధిస్తామని 420లు చెబుతున్నారు. అలా చెప్పే రాజకీయ పార్టీ కాంగ్రెస్ లేదా ఇతర పార్టీ ఏదైనా కావొచ్చు. అలా చెప్పడం అహంకారమే అవుతుంది. ప్రజాస్వామ్యంలో ఒకే పార్టీ 400.. అంతకన్నా ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం లేదు. ప్రజలు ఓటు వేస్తేనే సదరు అభ్యర్థి గెలుస్తారు. అలాంటిది ఓ రాజకీయ పార్టీ, ఆ పార్టీ నేత తమ పార్టీ ఇన్ని సీట్లు గెలుస్తామని ఎలా చెబుతుంది. దీనిని ముమ్మాటికీ అహంకారం అనే అంటారు’ అని ప్రకాశ్ రాజ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కాగా, కేంద్రంలో వరుసగా రెండు సార్లు అధికారం చేపట్టిన బీజేపీ ఈ సారి కూడా ఎన్నికల్లో విజయం సాధించి అధికారం చేపట్టి హ్యాట్రిక్ కొట్టాలని తహతహలాడుతోంది. ఈ నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా ముందుకుసాగుతోంది. ఈ ఎన్నికల్లో ఎన్డీయే 400 కంటే ఎక్కువ సీట్లలో విజయం సాధిస్తుందని ప్రధాని మోదీ సహా కమలం పార్టీ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. 400 సీట్లతో ఎన్డీయే మళ్లీ అదికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇదే విషయాన్ని ఫిబ్రవరి 5న రాజ్యసభలో ప్రధాని మోదీ కూడా చెప్పిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘కేంద్రంలో మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడటానికి ఇంకా ఎంతో దూరం లేదు. గరిష్టంగా 100-125 రోజులు మిగిలి ఉన్నాయి. ఈ సారి 400 సీట్లు గెలుస్తాం. దేశం మొత్తం ‘అబ్కీ బార్, 400 పార్’ అంటోంది’ అంటూ ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ పై విధంగా వ్యాఖ్యలు చేశారు.
Also Read..
Railing Collapses | ముందస్తు హోలీ వేడుకల్లో అపశృతి.. ఆలయంలో రెయిలింగ్ కూలి 22 మందికి గాయాలు
Arvind Kejriwal | ఢిల్లీ జల బోర్డు కేసు.. ఈడీ విచారణకు కేజ్రీవాల్ మరోసారి డుమ్మా
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

