Trains Cancelled | బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాన్ నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది. వందకు పైగా రైలు సర్వీసులను రద్దు చేసింది. తొలుత 43 రైళ్లను ఈస్ట్ కోస్ట్ రైల్వే రద్దు చేసింది. ఆ తర్వాత మరో 75కి పైగా రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. అక్టోబర్ 27, 28, 29, 30వ తేదీల్లో ఈ రైళ్లను రద్దు చేసినట్లుగా రైల్వే శాఖ తెలిపింది. ఆ వివరాలను వెల్లడించింది.
ఇక ఏపీ విషయానికొస్తే మంగళ, బుధవారాల్లో బయల్దేరే పలు ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు. రాజమహేంద్రవరం, నిడదవోలు, గుంటూరు, కాకినాడ, తెనాలి, రేపల్లె, మార్కాపురం, మచిలీపట్నం, నర్సాపూర్, విశాఖ, ఒంగోలు, మాచర్ల నుంచి బయల్దేరే పలు రైళ్లను రద్దు చేశారు. రద్దయిన రైళ్ల వివరాలను ప్రయాణికుల మొబైల్‌కు పంపించినట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. రద్దయిన రైళ్లలో టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులకు పూర్తి స్థాయి రిఫండ్ చేయనున్నట్లు వెల్లడించారు. ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందే తమ ప్రయాణించాల్సిన రైలు స్టేటస్‌ను తెలుసుకోవాలని రైల్వే అధికారులు ఈ సందర్భంగా సూచించారు.

East Coast Trains

Scr Trains Cancelled List1

Scr Trains Cancelled List2

Scr Trains Cancelled List3

Scr Trains Cancelled List4