అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది . ఏపీలో మొత్తం 4కోట్ల 7లక్షల 36,279 మంది ఓటర్లు ఉన్నారని, వీరిలో మహిళా ఓటర్లు 2,05,97,544 ఉండగా, పురుషులు 2,01,34,664 మంది ఉన్నారు. తుది జాబితా ప్రకారం రాష్ట్రంలో పురుషుల కన్నా 4,62,880 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. శ్రీకాకుళం, అనంతపురం మినహా మిగతా అన్ని జిల్లాల్లోనూ పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు.
4071 మంది థర్డ్ జెండర్స్ను ఉన్నారని వెల్లడించింది . రాష్ట్రంలో నికరంగా 29,544 మంది ఓటర్లు పెరిగారు. 2020 నవంబర్ 1న నవంబర్ 15న బద్వేలు నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్ల జాబితాతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఓటర్ల ముసాయిదా జాబితాలను ఎన్నికల సంఘం ప్రచురించింది. వాటి ప్రకారం ఏపీలో 4కోట్ల 7లక్షల 6,804 మంది ఓటర్లుండగా ప్రత్యే సమగ్ర సవరణ చేపట్టిన అనంతరం కొత్తగా లక్షా 69,916 మందిని జాబితాలో చేర్చింది. 1,40372 మందిని తొలగించారు.
అత్యధికంగా విశాఖపట్నంలో 16745 మంది ఓటర్లు పెరుగగా, పశ్చిమ గోదావరిలో 28,721 మంది ఓటర్లు తగ్గారు. అత్యధిక ఓటర్లున్న జిల్లాల జాబితాలో తూర్పుగోదావరి అగ్రస్థానంలో ఉండగా ఆ తరువాత స్థానాలు వరుసగా గుంటూరు, విశాఖపట్నంలో , కృష్ణా జిల్లాలున్నాయి.