హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): వరుస సెలవులు, శ్రావణమాసం సందర్భంగా తిరుమలలో శనివారం భక్తుల రద్దీ భారీగా పెరిగింది. రద్దీ కారణంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో కిటకిటలాడాయి. ఆక్టోపస్ భవనం వరకు సుమారు 4కిలో మీటర్ల మేర క్యూలైన్లు నిండిపోయాయి.
దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 24గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. క్యూలైన్లలోని భక్తులకు అన్న ప్రసాదాలు, పాలు, తాగునీరు పంపిణీ చేస్తున్నట్టు పేర్కొన్నారు. క్యూలైన్లలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా సిబ్బంది పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు.