అమరావతి : ఏపీలో కొన్ని నెలలుగా నెట్ వర్క్ ఆసుపత్రులకు పెండింగ్లో ఉన్న బకాయిలను ఆగస్టు 15 లోగా చెల్లించకపోతే రాష్ట్రవ్యాప్తంగా వైద్య సేవలను (Medical services ) నిలిపివేస్తామని ఏపీ స్పెషాలిటీ ఆస్పత్రుల సంఘం హెచ్చరించింది. ఈ మేరకు ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ సీఈవోకు (NTR Vaidya Seva Trust CEO) ఆస్పత్రుల సంఘం లేఖ రాసింది.
దాదాపు రూ. 2, 500 కోట్ల బకాయిలు ఉన్నాయని వెల్లడించింది. గత ఎనిమిది నెలల నుంచి బిల్లులు చెల్లించకపోవడంతో ఆస్పత్రులు నిర్వహించలేని దశలో ఉన్నామని వెల్లడించింది. తాము అనేక సార్లు అధికారులను కలవాలని ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయిందని పేర్కొన్నారు. బిల్లులను చెల్లింపు, వైద్య సేవల కోసం మౌలిక సదుపాయాలు కల్పించాలని లేఖలో కోరారు.