Tirumala | న్యూ ఇయర్ సందర్భంగా తిరుమల శ్రీవారిని ఓ భక్తుడు దర్శించుకోవడం ఇప్పుడు వైరల్‌గా మారింది. ఏడుకొండల వాడిని రోజుకు లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు కదా.. అందులో వింత ఏముందని అనుకుంటున్నారా! వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడంలో వింత లేదు.. అయితే వచ్చిన భక్తుడు ఒంటి నిండా బంగారంతో రావడమే ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటుంది.
హైదరాబాద్‌కు చెందిన తెలంగాణ ఒలింపిక్ సంఘం సంయుక్త కార్యదర్శి కొండా విజయ్ కుమార్ మంగళవారం నాడు ఇంటి నిండా బంగారంతో తిరుమలకు వచ్చాడు. దాదాపు 5 కిలోల బంగారు ఆభరణాలను ధరించి అతను శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా క్యూలైన్లో వేచి ఉన్న విజయ్‌కుమార్ ధరించిన భారీ ఆభరణాలు.. మిగతా భక్తుల దృష్టిని ఆకర్షించాయి. మెడలో, చేతికి ఉన్న భారీ ఆభరణాలను భక్తులు ఆసక్తిగా పరిశీలించారు. అయితే బంగారంపై తనకు ఆసక్తి ఎక్కువ అని.. అందుకే ఇలా భారీ ఆభరణాలు చేయించుకుని, ధరిస్తున్నానని విజయ్‌కుమార్ తెలిపారు.
5 కేజీల బంగారం ధరించి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గోల్డ్ మ్యాన్ pic.twitter.com/MrJcN9nCfk
— Telugu Scribe (@TeluguScribe) January 1, 2025