తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలవబడుతున్న తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి తమిళనాడుకు చెందిన భక్తులు భారీ విరాళాన్ని అందజేశారు. టీటీడీ చరిత్రలో అధిక మొత్తంలో ఒకేరోజు భారీ విరాళాన్ని తమిళనాడు భక్తులు రూ. 10 కోట్లు అందజేసి స్వామివారి పట్ల వారికున్న భక్తిని చాటుకున్నారు. తిరునల్వేలికి చెందిన గోపాల బాలకృష్ణన్ అనే భక్తుడు రూ. 7 కోట్లు స్వామివారికి సమర్పించుకున్నాడు.
అదేవిదంగా టీటీడీ నిర్వహణలో ఉన్న అన్నదానం సహ ట్రస్టులకు విరాళం అందజేశారు. ఏ స్టార్ టెస్టింగ్ అండ్ ఇన్స్పెక్షన్ ప్రైవేట్ లిమిటెట్ సంస్థ కోటీ విరాళం అందజేసింది. బాలకృష్ణ ఫ్యూయల్ స్టేషన్ సంస్థ శ్రీవాణి ట్రస్టుకు రూ. కోటీ, సీ హబ్ ఇన్స్పెక్షన్ సర్వీసెస్ సంస్థ ఎస్వీ వేదపరిరక్షణ ట్రస్టుకు రూ. కోటీ విరాళాన్ని అందజేసింది. ఈ మేరకు దాతలు తిరుమలలో ఈవో ధర్మారెడ్డికి చెక్కులను అందజేశారు.