(Guntur Cheater) న్యూఢిల్లీ : విమాన ప్రయాణికులను మోసం చేస్తున్న గుంటూరు వాసిని న్యూఢిల్లీ విమానాశ్రయం పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రముఖ విశ్వవిద్యాలయంలో చదువుతున్నట్లుగా పోజులు పెడుతూ ప్రయాణికులను మోసం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గుంటూరుకు చెందిన మోడెలా వెంకట ధినేష్ కుమార్‌ను ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు ఐజీఐ విమానాశ్రయం డిప్యూటీ పోలీస్ కమిషనర్ సంజయ్ త్యాగి ఒక ప్రకటనలో తెలిపారు. ఢిల్లీలోని ప్రఖ్యాత యూనివర్సిటీ విద్యార్థిగా నటిస్తూ విమాన ప్రయాణికులను టార్గెట్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నాడని డీసీపీ వెల్లడించారు. ఇప్పటికే ముంబై, హైదరాబాద్ విమానాశ్రయాల పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు. అయినప్పటికీ ఇతగాడి తీరుమార లేదు.
డీసీపీ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గుంటూరుకు చెందిన వెంకట ధినేష్ కుమార్ ఎంట్రీ టికెట్ కొనుగోలు చేసి విమానాశ్రయాల్లోకి ప్రవేశిస్తాడు. చాలా ఆపదలో ఉన్నట్లుగా నటిస్తూ అక్కడి ప్రయాణికులను సంప్రదిస్తాడు. తన గమ్యస్థానం వెళ్లేందుకు టిక్కెట్ కొనడానికి వారి సహాయం కోరతాడు. ప్రయాణానికి కావాల్సిన మొత్తంలో సగం డబ్బే ఉన్నదని, మిగతా సగం సాయం చేయాల్సిందిగా ప్రాధేయపడతాడు. గమ్యస్థానానికి చేరగానే ఆ మొత్తాన్ని తిరిగిచ్చేస్తానని నమ్మబలుకుతాడు. ఎవరో ఒకరు ఆయన మాటలకు చిక్కుకోగానే తన ఖాతాలోకి నగదు బదిలీ చేయమని కోరతాడు. ఆ తర్వాత వాళ్ల కండ్లు గప్పి పరారవుతుంటాడు.
గత నెల 19 న బరోడాకు చెందిన షా యాష్ రాకేశ్‌ను కలిసిన ధినేష్ కుమార్.. తన పాత కథ రిపీట్ చేసి విశాఖపట్నం వెళ్లేందుకు రూ.15 వేలు సాయం చేయమని కోరాడు. దాంతో ఆయన మాటలు నమ్మి ధినేష్ ఖాతాకు గూగుల్ పే ద్వారా రూ.9,250 రాకేశ్ బదిలీ చేశాడు. అయితే, ఎన్ని రోజులు గడిచినా డబ్బు తిరిగి చెల్లించకపోవడంతో రాకేశ్.. విమానాశ్రయం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. కాగా, గత నెల 30 న మరో వ్యక్తిని బుట్టలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్న ధినేష్ను పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. గత ఐదేండ్లలో ఎంతో మందిని ఇలా మోసం చేసినట్లు డీసీజీ సంజయ్ త్యాగి తెలిపారు. ఇతగాడిపై ముంబై, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ విమానాశ్రయాల్లో ఏడు కేసులు నమోదయ్యాయి.
ఇప్పటిదాకా కరోనా.. ఇప్పుడు ఫ్లొరోనా! దీని లక్షణాలు ఏంటి?.. ఎంత ప్రమాదకరం?
మీ జీవితభాగస్వామి మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త..!
చర్మంపై దద్దుర్లు, దురద ఉంటే.. ఒమిక్రాన్ కావచ్చు..?!
గాడిద పాలు ఆరోగ్యానికి మంచివేనా ? వాటికి ఎందుకంత డిమాండ్ ?
శృంగారంపై ఆసక్తి తగ్గిపోయిందా.. అయితే ఈ ఫుడ్స్ తీసుకోండి..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..