హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): ఏపీలోని పోలవరం ప్రాజెక్ట్ను మంగళవారం గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ పీ దోర్జీ గ్యాంబ సందర్శించారు. ఆయనకు ప్రాజెక్ట్ అతిథి గృహం వద్ద పలువురు అధికారులు స్వాగతం పలికారు.
కొద్దిసేపు వారితో సమావేశమైన ఆయన తరువాత పోలవరం స్పిల్వే, ఎగువ కాఫర్ డ్యామ్, గ్యాప్ 1, 2 పరిశీలించారు. ఇప్పటి వరకు జరిగిన పనుల వివరాలు తెలుసుకున్నారు. నిర్దిష్ట గడువులోగా పనులు పూర్తి చేయాలని సూచించారు.