అమరావతి : బడుగు, బలహీన వర్గాలకు,ముఖ్యంగా మహిళలకు విద్యాబుద్దులు నేర్పించిన గొప్ప సంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే (Mahatma Jyoti Rao Phule) అని వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) అన్నారు. జ్యోతిరావు ఫూలే వర్దంతి సందర్భంగా గురువారం తాడేపల్లి నివాసంలో జ్యోతిరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
ఫూలే బడుగు, బలహీన వర్గాల ప్రజల హక్కుల కోసం పోరాడిన మహానీయుడని ట్విట్టర్ ( Twitter ) ద్వారా కొనియాడారు. ప్రజలను చైతన్యపరిచేందుకు విద్య సరైన ఆయుధంగా భావించి విద్యకు దూరంగా ఉన్న వారిని చేరదీసి వారికి విద్యాబుద్ధులు నేర్పించిన గొప్ప వ్యక్తని అన్నారు.
ఆయన ప్రారంభించిన సేవా కార్యక్రమాలు అప్పట్లో ఎందరికో స్ఫూర్తినిచ్చాయని , ఫలితంగా విద్యా సమాన హక్కు దేశంలో కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు జోగి రమేష్, విడదల రజిని, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.