Visakha Steel Plant | విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితులకు పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
: విశాఖ స్టీల్ ప్లాంట్ ( Visakha Steel Plant) లో జరిగిన ఘోర ప్రమాదంలో ( Massive explosion ) మృతి చెందిన కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.
అమరావతి : విశాఖ స్టీల్ ప్లాంట్ ( Visakha Steel Plant) లో జరిగిన ఘోర ప్రమాదంలో ( Massive explosion ) మృతి చెందిన కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. దవాఖానలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంగళవారం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరమార్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో 8 మంది మృతి చెందండం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు రూ.25లక్షల చొప్పున పరిహారంతో పాటు ఒకరికి ఉద్యోగం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.10 లక్షలు ఇస్తామని తెలిపారు. సంఘటనపై కమిటీ వేసి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.
కాగా, విశాఖ ఉక్కు కర్మాగారం ప్లాంట్( Visakha Incident ) లో ఎంసీఎంఎస్-2, ఎస్టీసీ-3లో హీట్ ఎఫ్‌జీలో 1500 డిగ్రీల వేడి కలిగిన మెటల్ లిక్విడ్ లాడిల్ పేలడంతో భారీగా ప్రాణ నష్టం జరిగింది. ఉక్కు ద్రవాన్ని లిఫ్ట్ చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో ఐదుగురు ఉద్యోగులు ( Employees ) , ముగ్గురు ఒప్పంద కార్మికులు( Contract workers ) మృతి చెందారు.
మృతి చెందిన వారిలో అప్పారావు, ప్రభాకర్‌రావు, కృష్ణ, రమణ, త్రినాథ్, అప్పలరాజు, కుమార్ , మరో వ్యక్తి ఉన్నట్లు ప్లాంట్ యాజమాన్యం వెల్లడించింది. ప్రమాదంలో మరో ఆరుగురికి గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమం ఉందని తెలిపారు. గాయపడ్డ కార్మికులను, ఉద్యోగులను హుటాహుటినా విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఉన్న ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | రజనీకాంత్ అభిమానులకు గుడ్ న్యూస్ ..తెలంగాణలో సాధారణ టికెట్ ధరలకే ‘జైలర్ 2’..
Mamitha Baiju | ‘జై హనుమాన్’లో మమితా బైజు.. రిషబ్ శెట్టి, రానా సరసన కీలక పాత్రలో కనిపించనుందా?
Donald Trump: రష్యా నుంచి డీజిల్ కొంటామన్న ట్రంప్.. పుతిన్‌కు గిఫ్ట్ ఇచ్చారన్న జెలెన్స్కీ
Ramayana | కైకేయిగా లారా దత్తా, మంథరగా షీబా.. ‘రామాయణం’ నుంచి ఫస్ట్ లుక్స్ విడుదల
Drishyam 3 | ‘దృశ్యం 3’ బాక్సాఫీస్ సునామీ.. 8 రోజుల్లోనే రూ. 400 కోట్లు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

