అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి అల్టీమేటం ( Ultimatum ) జారీ చేసింది. ఇటీవల కేంద్రం పెంచిన టెస్టింగ్, ఫిట్నెస్ ఫీజు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 9న అర్ధరాత్రి నుంచి రైల్వే షెడ్స్, షిప్‌యార్డుల్లో గూడ్స్ రవాణా ( Goods transport ) నిలిపివేయాలని ఆ సంఘం నిర్ణయించింది.
ఈ మేరకు విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అసోసియేషన్ నాయకులు మాట్లాడారు. కేంద్రం పాత వాహనాపపై అదనపు టెస్టింగ్, ఫిట్నెస్ ఛార్జీల పెంపు సరికాదని అన్నారు. దీని వల్ల సరకు రవాణా యజమానులపై పెనుభారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేవారు. కేంద్రం పెంచిన ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వం తగ్గించే అధికారం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా చర్యలు తీసుకోకపోతే రాష్ట్రంలోని 10 వేల గూడ్స్ లారీలు ఆగిపోతాయని వివరించారు.