హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): ఈ నెల 17 నుంచి తిరుమలలో ధనుర్మాస ఉత్సవాలు అత్యంత వైభవంగా జ రుగనున్నాయి. తొలిరోజు తెల్లవారుజామున బ్రహ్మ ముహుర్తానికి గంటన్నర ముం దుగా తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారికి సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై సేవతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి.
అనంతరం భోగ శ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీకృష్ణస్వామి వారికి సేవ నిర్వహిస్తారు.