అమరావతి : ఏపీలోని బాపట్ల(Bapatla) జిల్లా నల్లమడ వాగులో నలుగురు యువకులు గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరి మృతదేహాలు లభ్యం కాగా మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్(Hyderabad) నుంచి సూర్యలంక బీచ్‌కు వచ్చిన నలుగురు యువకులు మార్గమధ్యలో నల్లమడ వాగులో ఈత కొట్టడానికి దిగారు. వాగు ప్రవాహంలో నలుగురు గల్లంతు కాగా సునీల్, సన్నీ మృతదేహాలను పోలీసులు బయటకు తీశారు.గిరి, నందు కోసం వాగులో పోలీసులు గాలిస్తున్నారు.