అమరావతి : ఏపీ ( Andhra Pradesh ) హైకోర్టు న్యాయమూర్తులుగా ( Judges ) నలుగురు బుధవారం ప్రమాణం చేశారు. ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు మేరకు రాష్ట్ర హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా పనిచేస్తున్న జస్టిస్ నూనెపల్లి హరినాథ్, మండవ కిరణ్మయి ( Mandava Kiranmayi ) , జగడం సుమతి, న్యాపతి విజయ్ శాశ్వత న్యాయమూర్తులుగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణ స్వీకారం చేయించారు. వీరి నియామకంతో ఏపీ హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తుల సంఖ్య 24కు చేరుకుంది.