అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి ( Tirupati ) పట్టణం వాణినగర్లో నాలుగు అంతస్తుల భవనం( Building collapses ) కుప్ప కూలింది . ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పక్కస్థలంలో నిర్మాణం కోసం గుంతలు తీయడంతో ప్రమాదం చోటు చేసుకుంది.
ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు, రెస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. శిథిలాల కింద ఉన్న వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. గాయపడ్డవారిని హుటాహుటినా ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు.