Kakinada | కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొవ్వూరు బ్రిడ్జి వద్ద రోడ్డు దాటుతున్న కూలీలను ఓ టిప్పర్ వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. క్షతగాత్రులను కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. మృతులను వాసంశెట్టి సత్యవతి (60), పాలిక కృష్ణవేణి(35), చిట్టెమ్మ (45), చెల్లూరి అన్నవరం(45)గా గుర్తించారు. గాయపడిన వారిని మట్టపర్తి అరుణ కుమారి, పాలిక నాగమణిగా గుర్తించారు.