అమరావతి : ఏపీలో ఘోర రోడ్డుప్రమాదం (Road Accident) జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా లారీ డ్రైవర్‌కు గాయాలు అయ్యాయి. విజయనగరం ( Vijayanagaram ) జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి గ్రామం వద్ద రహదారిపై కారు అదుపు తప్పి అవతలి రోడ్డు వైపు దూసుకెళ్లి బోల్తాపడగా అదే సమయంలో అటుగా వెళ్తున్న లారీ ఢీ కొట్టింది. కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా లారీ డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన వడ్డే అభినవ్, మణిమాల, ద్రవిడ కౌశిక్, వాహన డ్రైవర్ జయేశ్లు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడ్డ లారీ డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.