అమరావతి : ఏపీలోని ప్రకాశం( Prakasam ) జిల్లా ఒంగోలు మండలంలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో దిగిన నలుగురు చిన్నారులు గల్లంతయ్యారు ( Missing ) . చెరువుకొమ్మపాలెం కరేటి సుశాంత్ (12) , కరేటి అభిరామ్ (14), చిన్నూ, దినేష్ అనే నలుగురు ఆడుకుంటూ చెరువు నీటి కుంటలో స్నానానికి దిగి ప్రమాదవశాత్తు నీట మునిగిపోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు మొదలు పెట్టారు. నీటి కుంట వద్ద ఒడ్డున పిల్లల దుస్తులు, చెప్పులు లభ్యమయ్యాయి. ఇంకా చిన్నారుల ఆచూకి తెలియరాలేదు.