 
                                                            అమరావతి : ఏపీలోని కాకినాడ జిల్లాకు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అనిశెట్టి బుల్లబ్బాయిరెడ్డి(Anishetty Bullabbaireddy ) మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతున్న మాజీ ఎమ్మెల్యే యు.కొత్తపల్లి మండలం నాగులపల్లిలో మంగళవారం ఉదయం మృతి చెందారు. గతంలో సంపర నియోజకవర్గం (Sampara Constituency) నుంచి రెండుసార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పని చేశారు.
బుల్లబ్బాయి మృతికి పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. వ్యాపార రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఆయన విద్యాసంస్థల ద్వారా కూడా గుర్తింపు పొందారు. ఏపీఎస్సార్టీసీకి రీజనల్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్‌గానూ అనిశెట్టి పని చేశారు.
 
                            